'లీడర్', 'మిరపకాయ్', 'మిర్చి', 'భాయ్ 'తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. గత కొంత కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇకపై సినిమాల్లో నటించననీ కూడా చెప్పేసిందీ బ్యూటీ. ప్రస్తుతం కొత్త లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుందట. విదేశాల్లో ఉన్నత చదువులను అభ్యసిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలకు దూరంగా ఉన్నా కానీ, సోషల్ మీడియాలో అభిమానులతో ఛాటింగ్ చేస్తూ టచ్‌లోనే ఉంటోంది. అందుకే సోషల్ మీడియాలో అమ్మడిని అభిమానులు మీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎప్పుడు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారట. నేనింక సినిమాల్లో నటించను అని చెబుతున్నా, లేదు చేయాల్సిందే అంటూ అభిమానులు కోరుతున్నారట రీచా గంగోపాధ్యాయని. అందుకే సోషల్ మీడియా వేదికగా తానింక సినిమాల్లో నటించనని తేల్చి చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. తన హాట్ హాట్ అందచందాలతో కుర్రోళ్ల గుండె కొల్లగొట్టేసిన బ్యూటీ రీచా. తెలుగుతో పాటు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. 'మిరపకాయ్', మిర్చి, తదితర సినిమాలు ఈ ముద్దుగుమ్మకి మంచి హిట్స్‌గా నిలిచాయి. కానీ ఎందుకో సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అవకాశాలు రాక కొందరు ముద్దుగుమ్మలు సినిమాలకు దూరంగా ఉంటే, ఈ ముద్దుగుమ్మ మాత్రం కావాలనే సినిమాలకు దూరమైందని తెలుస్తోంది. రీచాకి చదువంటే చాలా ఇష్టం. గతంలోనూ ఈ విషయం చాలా సార్లు చెప్పింది. అందుకే తనకి ఇంట్రెస్ట్ ఉన్న చదువు వైపే మొగ్గు చూపినట్లుంది. పోనీలెండి.. ఈ చదువుల తల్లిని చదువుకోనిద్దాం!