ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమాపై ఇటీవలే.. ఓ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సినిమాని సలార్ అనే పేరు పెట్టారు. సలార్... సౌండింగ్ బాగుంది. కానీ.. అర్థం ఏమిటా? అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ పేరుకి రకరకాల అర్థాలూ తీశారు. అత్యంత క్రూరుడైన వ్యక్తి అని, బలవంతుడని, లీడర్ అని... ఇలా చాలా రకాలు గా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్.. ఈ టైటిల్ కి సరైన అర్థం చెప్పాడు.
సలార్ అంటే.. అత్యంత నమ్మకస్థుడైన బంటు అని. రాజుకి కుడి భుజం అని అర్థం అట. తన రాజు కోసం ఏమైనా చేసే... సైన్యాధ్యక్షుడు.. ఈ సలార్. `బాహుబలి`లో ప్రభాస్ పాత్ర కూడా ఇంతే కదా? అయితే అది జానపదం... ఇది యాక్షన్ డ్రామా. ప్రస్తుతం `రాధేశ్యామ్` పనిలో ఉన్నాడు ప్రభాస్. అది పూర్తయిన వెంటనే `ఆదిపురుష్` మొదలవుతుంది. `సలార్` 2021 జూన్‌లో పట్టాలెక్కొచ్చు.