చిరంజీవిని ఆకాశంతో పోల్చిన యంగ్‌ హీరో!

మరిన్ని వార్తలు

ఏ ఫిల్మ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా, సినిమాల్లో నటులుగా ప్రూవ్‌ చేసుకోవాలని కోటి ఆశలతో వచ్చే ఈ జనరేషన్‌ ఆర్టిస్టులందరికీ చిరంజీవే ఇన్నిప్రేషన్‌. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. కానీ, యంగ్‌ హీరో కార్తికేయ మాత్రం ఆకాశమే హద్దుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానంటున్నాడు. అయితే, ఆ ఆకాశం ఎవరో కాదు. చిరంజీవేనట. చిరంజీవిని ఆకాశంతో పోల్చి, ఈ యువ హీరో తన అభిమానాన్ని చాటుకున్నాడు.

 

తొలి సినిమా 'ఆర్‌ఎక్స్‌ 100'తో సంచలన విజయాన్ని అందుకున్న కార్తికేయ, తదుపరి 'హిప్పీ'తో ఓ రకమైన కొత్తదనం ట్రై చేశాడు. కానీ నిరాశ పడ్డాడు. నిరాశ ఎదురైంది కదా.. అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు మనోడు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మూడో సినిమాగా కార్తికేయ నుండి రాబోతున్న 'గుణ 369' ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కూల్‌ రొమాంటిక్‌ అండ్‌ యాక్షన్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రచార చిత్రాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ప్రమోషన్స్‌ కూడా జోరుగానే నిర్వహిస్తున్నారు. సో ఈ సినిమాకి ఏమాత్రం పోజిటివ్‌ టాక్‌ వచ్చినా, తనకున్న 'ఆర్‌ఎక్స్‌ 100' ఇమేజ్‌తో మనోడు ఓ మోస్తరు హిట్‌ని తన ఖాతాలో వేసేసుకుంటాడు.

 

మరోవైపు, 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలో కార్తికేయ విలనిజం చూపించనున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల గ్యాప్‌తోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మొదట్లో ఈ సినిమాని ఆగస్ట్‌ 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనుకున్న టైంకి 'సాహో' పోస్ట్‌ పోన్‌ కావడం, ఆగస్ట్‌ 30 స్లాట్‌ని బుక్‌ చేసుకోవడంతో, 'గ్యాంగ్‌లీడర్‌' రిలీజ్‌లో కొంత సందిగ్ధత నెలకొంది. కానీ ఎలాగైనా ఆగస్ట్‌లోనే విడుదల చేయాలనే పట్టు మీదున్నారట. ఒకవేళ ఆగస్ట్‌ 15కే 'గ్యాంగ్‌లీడర్‌' ప్రేక్షుల ముందుకు వచ్చినా వచ్చేయొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS