స్లాట్‌ బుక్‌ చేసుకున్న 'గుణ 369'!

మరిన్ని వార్తలు

'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో సంచలనమైన యంగ్‌ హీరో కార్తికేయ తాజా చిత్రం 'గుణ 369'. చాలా వేగంగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఆగస్ట్‌ 2న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. కార్తికేయకు జోడీగా ఈ సినిమాలో అనఘ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. బోయపాటి శీను దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. తొలి సినిమా అయినా, డైరెక్టర్‌ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఈ సినిమాపై.

 

మంచి సినిమాలు రావడం లేదన్న మాటలకు మా సినిమా చెక్‌ పెడుతుంది.. అంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు 'గుణ 369' గురించి. సరే, కాన్ఫిడెన్స్‌ బాగానే ఉంది. ఈ మధ్య మంచి సినిమా, చెడ్డ సినిమా అనే తేడాని ఎలా లెక్కగడుతున్నారో అర్ధం కావడం లేదు. యూత్‌ కంటెంట్‌ మూవీస్‌ ఒక్కోసారి హిట్‌ నుండి సూపర్‌ హిట్స్‌ అయిపోతున్నాయి. కథా, కథనాలు బాగున్నాయన్న సినిమాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంటున్నాయి.

 

అన్నీ బాగానే ఉన్నాయి కదా.. పలానా సినిమా ఎందుకు ఆడలేదు.. అనే ప్రశ్నలు చాలా సందర్భాల్లోనే విన్నాం. కానీ, మన 'గుణ' టీమ్‌ కాన్ఫిడెన్స్‌ ఏంటో తెలీదు కానీ, మా సినిమా మంచి సినిమా అంటూ ముందే హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్సే వచ్చింది. కార్తికేయకు మూడో సినిమాగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇటీవల వచ్చిన 'హిప్పీ' నిరశపరచడంతో ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడీ విలక్షణ హీరో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS