'కాదల్‌ సైకో' స్టైలిష్‌ స్టైలిష్‌ 'సాహో'.!

By iQlikMovies - July 04, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌ నటిస్తున్న 'సాహో' చిత్రానికి సంబంధించి పాటల పండగ మొదలు కానుంది. డేట్‌ ఫిక్స్‌ చేయలేదు కానీ, త్వరలోనే ఫస్ట్‌ సింగిల్‌ టీజర్‌ని వదలనున్నామని సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా హీరో ప్రబాస్‌, హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ పోస్టర్స్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌ స్టిల్స్‌లో ప్రబాస్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. శ్రద్ధాకపూర్‌ మరింత అందంగా స్టైలిష్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇదో గ్రూప్‌ సాంగ్‌లా అనిపిస్తోంది. ప్రబాస్‌, శ్రద్ధా ఇద్దరూ ఎనర్జిటిక్‌గా అందంగా కనిపిస్తున్నారు.

 

'కాదల్‌ సైకో' అంటూ సాగే ఈ సాంగ్‌ టీజర్‌ ఇంకా రిలీజ్‌ కాకుండానే, ప్రస్తుతం వదిలిన స్టిల్స్‌ అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాకి జిబ్రాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యిందనీ తెలుస్తోంది. ఆస్ట్రియాలో ప్రస్తుతం బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌ కోసం 'సాహో' టీమ్‌ సెర్చింగ్‌ మొదలుపెట్టింది. ఈ రెండు పాటలను అక్కడే చిత్రీకరించనున్నారట. ఆగస్ట్‌లో సినిమా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు కూడా వినూత్న ఆలోచన చేస్తున్నారట. ప్రమోషన్స్‌ కోసం స్పెషల్‌ టీమ్‌ వర్క్‌ చేస్తోందనీ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS