‘అరణ్య’ నుండి అదిరిపోయేలా మరో వీడియో.!

మరిన్ని వార్తలు

రానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘అరణ్య’ మూవీ నుండి లేటెస్ట్‌గా మరో వీడియో రిలీజ్‌ చేశారు. అడవి మనిషిలా మారేందుకు రానా ఎంత కష్టపడ్డాడు, ఏనుగును ఎలా మచ్చిక చేసుకున్నాడు.? అడవి భాషను ఎలా ప్రాక్టీస్‌ చేశాడు.? అనే అంశాల్ని ఈ వీడియోలో చూపించారు. గతంలో రిలీజ్‌ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడీ టీజర్‌ ఆసక్తి కలిగిస్తోంది. ‘ఫ్రమ్‌ ఏ సూపర్‌ స్టార్‌ టు ఏ ఫారెస్ట్‌ మ్యాన్‌’ అంటూ ఈ తాజా వీడియోను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. రియల్‌ ఫారెస్ట్‌లో రియల్‌ ఎలిఫెంట్స్‌తో రానా చేసే విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి ఈ వీడియోలో. ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరణ్య’ మూవీ ఏప్రిల్‌ 2న రిలీజ్‌ కానుంది.

బహు భాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమాని హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళంలో ‘కాదన్‌’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. అడవి మనిషిలా సహజంగా కనిపించేందుకు రానా చాలా కష్టపడ్డాడు. ఫిట్‌నెస్‌ పరంగా కొన్ని కీలకమైన జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. అందుకే ఈ చిత్రం రానాని నటుడిగా నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకువెళ్లనుందనడం అతిశయోక్తి కాదేమో. రానాతో పాటు పుల్ కిత్ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌ తదితర బాలీవుడ్‌, కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS