విలక్షణ నటుడిగా ఈ జనరేషన్‌కి పేరు తెచ్చుకున్న హీరో రానా. క్యారెక్టర్ నచ్చితే చాలు, నిడివిని పట్టించుకోడు. పోజిటివ్, నెగిటివ్ అనే తేడా పట్టడు పాత్ర విషయంలో. రంగంలోకి దూకుడే దూకుడు. స్టేజ్‌పై యాంకరింగ్ చేయగడు. హ్యాండ్సమ్ లుక్స్‌తో ర్యాంప్‌పై వాక్ చేయగడు. భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా సినిమాు చేయగడు. అదీ మన రానా గారి హిస్టరీ సింపుల్‌గా. ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ సినిమాలో నటిస్తున్న రానా, మరో వైపు హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.
ఈ సినిమా నుండి వెరీ లేటెస్ట్గా ఓ లుక్ రిలీజ్ చేశారు. గతంలో రిలీజ్ చేసిన లుక్‌కి కొనసాగింపుగా కనిపిస్తోంది ఈ లుక్. ఏనుగు తొండాన్ని పట్టుకుని కూల్‌గా కనిపించాడు ఆ లుక్‌లో రానా. ఇక్కడ మాత్రం గట్టిగా అరుస్తూ, తానే ఏనుగంత బలవంతుడిలా కనిపిస్తున్నాడు. పొడుగాటి గెడ్డం, భీకరమైన శరీర సౌష్టవం, జ్యూట్ క్లాత్‌తో తయారు చేసిన దుస్తులు ధరించి, చేతిలో డిఫరెంట్‌గా డిజైన్ చేసినట్లున్న ఓ కర్ర పట్టుకుని చాలా కోపంగా కనిపిస్తున్నాడు. విడుదలైన కొద్ది సేపట్లోనే ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తోంది. తెలుగులో ‘అరణ్య’ టైటిల్‌తోనూ, తమిళంలో ‘కాదన్’ టైటిల్‌తోనూ రిలీజ్ అవుతోంది. క్యూట్ భామ శ్రియ పిల్గోంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.