గ్లామ్‌షాట్‌: కత్తిలాంటి ఫిజిక్‌: కిర్రాకు పోజ్‌!

By Inkmantra - September 16, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు కదా. అలా వెండితెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలని తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ హంసా నందిని స్పెషల్‌ రోల్స్‌కే ఫిక్సయిపోయింది. హాట్‌ ఐటెం బాంబ్‌గా పేరు తెచ్చుకుంది. అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుపు తీగలా ఎంట్రీ ఇస్తుంటుంది. 'మిర్చి' సినిమాతో ఐటెం గాళ్‌ అవతారమెత్తింది. 'మిర్చీ.. మిర్చీ.. మిర్చీ లాంటి కుర్రోడే.. అంటూ డార్లింగ్‌తో మాస్‌ స్టెప్పులిరగదీసిన హంసా ఆ తర్వాత పలు పాపులర్‌ స్పెషల్‌ సాంగ్స్‌లో చిందేసింది. బాలయ్య, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలతో పాటు, రాజ్‌ తరుణ్‌ తదితర యంగ్‌ హీరోస్‌ సరసనా హాట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చింది.

 

మోడల్‌గా డాన్సర్‌గా అలరించిన హంసా నందినికి సోషల్‌ మీడియాలో విచ్చల విడిగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆ ఫ్యాన్స్‌ని ఉత్సాహంలో నింపేందుకు అమ్మడు అప్పుడప్పుడూ హాట్‌ ఫోటో సెషన్‌ చేయించుకుంటూ ఉంటుంది. అలా తాజాగా ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. బికినీలో స్విమ్మింగ్‌ పూల్‌ చెంత అలా నడిచొస్తున్న హంసా నందిని కటౌట్‌ కేక పుట్టిస్తోంది. బ్లాక్‌ సింగిల్‌ పీస్‌ బికినీలో బాటమ్‌ని ఓ చిన్నపాటి డిజైనర్‌ టవల్‌తో కవర్‌ చేసింది. హెయిర్‌ని లూజ్‌గా వదిలేయకుండా, పైకి ముడి పెట్టి కట్టింది. సుతారమైన నడుముపై వయ్యారంగా చేయి పెట్టి కెమెరాకి ఇచ్చిన పోజుకు నెటిజన్స్‌ ఫిదా అయిపోతున్నారంతే. హంసా..! నువ్వు కెవ్వు కేకా.. అని రిప్లై ఇస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS