'దేశ ముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని క్యూట్‌గా పలకరించిన భామ హన్సిక. తొలి సినిమాకే హిట్ కొట్టడంతో పాటు, కుర్రకారులో మంచి క్రేజ్ కూడా దక్కించుకుంది. ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్స్‌తో పాటు, రామ్, మంచు విష్ణు వంటి యంగ్ హీరోల సరసనా ఆడి పాడింది. అయితే, తన నాజూకు అందాలను కాస్త బొద్దుగా పెంచేయడంతో, ఆ అందాలకు తెలుగు తంబీల కన్నా తమిళ తంబీలు ఎక్కువగా ఇంప్రెస్ అయ్యారు. అందుకే అక్కడే స్టార్డమ్ దక్కించుకుంది హన్సిక. హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'మహా' విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు చాలా తమిళ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు హన్సిక చేతిలో ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, త్వరలో హన్సిక నటించిన తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్'. ఈ సినిమాలో హన్సిక పాత్రను చాలా ఎంటర్టైనింగ్గా డిజైన్ చేశారట డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ విలన్‌గా నటిస్తోంది. 'గౌతమ్ నందా' తర్వాత హన్సిక పూర్తి స్థాయి హీరోయిన్గా నటించిన తెలుగు సినిమా ఇది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా తెలుగులో హన్సికకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోందో. అన్నట్లు ఓ తెలుగు వెబ్ సిరీస్‌లోనూ హన్సిక నటిస్తోంది.