ఇలాంటి వార్త‌లు ఎలా రాస్తార‌బ్బా..?

మరిన్ని వార్తలు

సిమ్లా యాపిల్‌లా ఊరిస్తుంటుంది హ‌న్సిక‌. దేశ‌ముదురులో త‌న లేలేత సోయ‌గాల‌తో ఆక‌ట్టుకుని, యువ హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది. తెలుగు ప్రేక్ష‌కుల మాటేమో గానీ, త‌మిళ తంబీలు మాత్రం హ‌న్సిక అందాల‌కు ఫిదా అయ్యారు. అందుకే తెలుగులో కంటే, అక్క‌డే ఎక్కువ మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఈమ‌ధ్య హ‌న్సిక‌కు అవ‌కాశాలు బాగా త‌గ్గాయి. అందుకే త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంద‌న్న ఓ వార్త చిత్ర‌సీమ‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

 

ముంబైకి చెందిన ఓ ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కుమారుడిని హ‌న్సిక వివాహం చేసుకోబోతోంద‌ని, ఈవారంలోనే పెళ్ల‌ని, లాక్ డౌన్ వ‌ల్ల‌, వివాహం గ‌ప్ చుప్‌గా జ‌రగ‌నున్న‌ద‌ని గుస‌గుస‌లాడుకున్నారు. కొన్ని త‌మిళ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్లూ ఈ వార్త‌ని హైలెట్ చేశాయి. దాంతో హ‌న్సిక ఖంగుతింది. నా పెళ్లి పై వ‌స్తున్న వార్తల్లో నిజం లేద‌ని, ఆ వార్త‌లు చూసి నేను కూడా షాక్ కి గుర‌య్యా.. అని క్లారిఫై ఇచ్చింది. అస‌లు ఇలాంటి వార్త‌లు ఎలా రాస్తారో? అంటూ ఆశ్చ‌ర్య‌పోయింది. పెళ్లికి తానేమీ వ్య‌తిరేకం కాద‌ని, అయితే... త‌న పెళ్లి ఎప్పుడు జ‌రిగినా గ్రాండ్‌గానే జ‌రుగుతుంద‌ని, గ‌ప్ చుప్‌గా చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చింది. త‌న దృష్టి ఇప్పుడు 50వ సినిమాపై ఉంద‌ని, ప్ర‌స్తుతం సినిమా స‌న్నాహాల్లో బిజీగా ఉంద‌ని చెప్పింది హ‌న్సిక‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS