'జాక్‌పాట్‌' డైరెక్టర్‌తో 'దేశముదురు' బ్యూటీ!

మరిన్ని వార్తలు

'దేశ ముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన క్యూట్‌ బ్యూటీ హన్సిక. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కానీ, స్టార్‌డమ్‌ ఆశించినంతగా దక్కించుకోలేకపోయింది. కోలీవుడ్‌లో అమ్మడికి అదృష్టం కలిసొచ్చింది. అక్కడ స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. వరుస అవకాశాలతో బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా చెలామనీ అవుతోంది హన్సిక కోలీవుడ్‌లో. అప్పుడప్పుడూ తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా హన్సిక తెలుగులో 'తెనాలి రామకృష్ణ బిఎబిఎల్‌' సినిమాలో నటిస్తోంది.

 

వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో హన్సిక లాయర్‌ పాత్ర పోషిస్తోంది. సందీప్‌ కిషన్‌ ఈ సినిమాలో హీరో. కామెడీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జి. నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్‌గా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో హన్సిక ఎప్పటిలాగే క్యూట్‌ అండ్‌ నాటీగా కనిపించింది. ఇదిలా ఉంటే, తాజాగా తమిళంలో హన్సిక 'జాక్‌పాట్‌' కొట్టిందనీ తెలుస్తోంది. రీసెంట్‌గా జ్యోతిక ప్రధాన పాత్రలో 'జాక్‌పాట్‌' మూవీని తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్‌ గురించి తెలిసిందే.

 

ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్‌. ఆయన తాజాగా హన్సికకు ఓ లేడీ ఓరియెంటెడ్‌ స్టోరీని వినిపించాడట. ఆ స్టోరీ లైన్‌ నచ్చిన హన్సిక వెంటనే ఆ ప్రాజెక్ట్‌ని ఓకే చేసిందట. హారర్‌ టచ్‌ ఉన్న కథ అనీ తెలుస్తోంది. గతంలో 'కళావతి' తదితర హారర్‌ చిత్రాల్లో నటించిన అనుభవం హన్సికకు ఉంది. అలా ఓ వైపు 'తెనాలి రామకృష్ణ' వంటి కామెడీ మూవీనీ, ఇంకో వైపు జాక్‌పాట్‌ డైరెక్టర్‌తో హారర్‌నీ డీల్‌ చేసే ప్లాన్‌ చేస్తోంది క్యూటీ హన్సిక. ఏమనుకునేరు హన్సిక పాప మస్త్‌ 'దేశముదురు' సుమీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS