'దేశముదురు' సినిమాతో తెలుగులో క్యూట్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. అతి చిన్న వయసులోనే హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'దేశముదురు' హన్సికకు తెలుగులో తొలి సినిమా. ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
తర్వాత తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో గ్లామర్ నటిగా పేరు తెచ్చుకుంది. తమిళంలో స్టార్డమ్ సంపాదించింది. ప్రస్తుతం 'మహా' సినిమాలో నటిస్తోంది. కాగా హన్సిక ఓ సీరియస్ డెసిషన్ తీసుకుందట. ఇంతవరకూ గ్లామర్ డాళ్‌గా నటించిన హన్సిక ఇకపై గ్లామర్‌కి టాటా బైబై చెప్పేస్తానంటోంది. అంటే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనన్న మాట. అయితే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌ని డీల్ చేయగల సత్తా ఈ క్యూటీకి ఉందా.? అంటే తెలుగులో అంతగా చెప్పలేం కానీ, తమిళంలో అంత సీనుంది హన్సికకు.
తెలుగులో గ్లామర్ డాళ్‌గా పేరు తెచ్చుకున్న తాప్సీ పన్ను బాలీవుడ్‌కెళ్లాక పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్ని ఎలా డీల్ చేస్తోందో చూస్తున్నాం కదా. అలాగే తానేం తక్కువ కాదంటోంది హన్సిక కూడా. తమిళంలో ఎలాగూ తనకు స్టార్డమ్ ఉంది. అందుకే ఇకపై గ్లామర్ పాత్రల్ని కాస్త తగ్గించి, పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోందట. డెసిషన్ మాత్రమే హన్సికది. అయితే దాని రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్ కదా.
చూడాలి మరి ఈ క్యూట్ బ్యూటీ తనలో దాగున్న ఎక్స్ట్రా టాలెంట్‌ని ఎలా బయటికి తీస్తుందో.!