యాక్షన్‌ షురూ అంటోన్న క్యూట్‌ బ్యూటీ.!

By Inkmantra - October 12, 2019 - 13:45 PM IST

మరిన్ని వార్తలు

'దేశముదురు' సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక. ఆ తర్వాత పలు చిత్రాల్లో గ్లామర్‌ తారగా మెప్పించింది. ముద్దుగా కొంచెం బొద్దుగా ఉండే ఈ బ్యూటీ తమిళ తంబీలను ఎక్కువ ఇంప్రెస్‌ చేయడంతో, తెలుగులో కన్నా, తమిళంలోనే స్టార్‌డమ్‌ సంపాదించింది. అక్కడ కమర్షియల్‌ సినిమాలతో పాటు, ప్రాధాన్యత కలిగిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. హన్సికతో సినిమా అంటే, కొన్ని కండిషన్స్‌ అప్లై చేయాలంట. గ్లామర్‌ పాత్రలయితే, అస్సలు ఒప్పుకోనంటోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలయితేనే ఒప్పుకుంటానని తెగేసి చెబుతోంది.

 

ప్రస్తుతం హన్సిక చేతిలో చాలానే ప్రాజెక్టులున్నాయి. యంగ్‌ హీరో ఆది పినిశెట్టితో 'పార్ట్‌నర్‌' అనే బైలింగ్వల్‌ మూవీలో నటిస్తోంది. అలాగే సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్‌' సినిమాలో నటిస్తోంది. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అలాగే హన్సిక ప్రధాన పాత్రలో 'మహా' మూవీ ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా హన్సిక మరో కొత్త చిత్రానికి సైన్‌ చేసింది.

 

ఈ సినిమా కోసం హన్సిక యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో నటించాల్సి ఉందట. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. హన్సికపై చిత్రీకరించే యాక్షన్‌ సీన్స్‌ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ కానున్నాయట. హరి - హరీష్‌ ద్వయం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరక్కెనుంది. అన్నట్లు ఈ సినిమాలో క్రికెటర్‌ శ్రీశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS