పవన్‌ ధామ్‌లో పవర్‌ స్టార్‌!

మరిన్ని వార్తలు

ఆడంబర జీవితాన్ని ఎప్పుడూ కోరుకోలేదు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. ఆయనతో అతి సన్నిహితంగా మెలిగే ప్రతీ ఒక్కరికీ ఈ విషయం అవగతమవుతుంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం చవి చూసిన పవన్‌ కళ్యాణ్‌, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అంటే, ప్రకృతి చికిత్స నిమిత్తం హరిద్వార్‌లో ఉన్నారు. గత కొంత కాలంగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారు పవన్‌ కళ్యాణ్‌.

 

అది మరీ బాధించడంతో, ఈ మధ్యనే ప్రకృతి చికిత్స నిమిత్తం హరిద్వార్‌ వెళ్లారు. అక్కడ ఓ సాధారణ ఆశ్రమంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఓ సాధారణ బెడ్‌, డొక్కు ఫ్యాన్‌.. ఇలా ఆడంబరాలకు అత్యంత దూరంగా మసలుతున్నారు. ఆ ఆశ్రమం పేరు కూడా ఆయన పేరు మీదే ఉంది. దాని పేరు పవన్‌ ధామ్‌. ప్రస్తుతం ఈ ఆశ్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, 'సేవ్‌ గంగా' అంటూ గంగా నది ప్రక్షాళనకు ఇటీవల మద్దతిచ్చారు పవన్‌ కళ్యాణ్‌. మరోవైపు ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

 

రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే సదుద్దేశ్యంతో జనంలోకి అడుగుపెట్టిన పవన్‌ కళ్యాణ్‌కి పూర్తిగా నెగిటివ్‌ రిజల్ట్‌ని కట్టబెట్టారీ జనం. దాంతో రాజకీయాలతో బ్రేకప్‌ చేసుకుని, మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఆలోచనలో పవన్‌ ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే, పవన్‌ కళ్యాణ్‌ నుండి మాత్రం ఈ విషయమై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఏది ఏమైనా నా జీవితం ప్రజలకే అంకితం అంటున్నారాయన. అభిమానులు ఆయన్ని హీరోగా తెరపై చూడాలనుకుంటున్నారు. ఫైనల్‌గా నిర్ణయం ఆయనదే. ఏం చేస్తారో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS