తొలి సినిమాతోనే క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇపుడు తేజ సజ్జా తో హను-మాన్ సినిమాని తీశాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైయింది. టీజర్ ఒక జలపాతాన్ని చూపిస్తూ మొదలైయింది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో పడినట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. ఒక సామాన్యుడు హనుమాన్ పవర్ తో సూపర్‌హీరోగా ఎలా మారదనేది టీజర్ లో కంటెంట్. టీజర్ చాలా రిచ్ గా వుంది. విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి.
ప్రశాంత్ వర్మ వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. కెమెరా వర్క్ , సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ ఉన్నతంగా వున్నాయి. తేజ సజ్జ కొత్తగా కనిపించాడు. మృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ టీజర్ లో కీలకంగా కనిపించారు. హను మాన్ ని పాన్ ఇండియా విడుదల చేస్తున్నారు. టీజర్ చూస్తే పాన్ ఇండియా కంటెంట్ వుందనే నమ్మకాన్ని కలిగించింది.