మంచి టేస్ట్ ఉన్న నిర్మాతకి పుట్టినరోజు శుభాకాంక్షలు

మరిన్ని వార్తలు

సినిమాల పై ప్రేమతోనే సినిమాలు తీస్తున్నాము అంతేతప్ప ఇదేదో వ్యాపారంగా చూడట్లేదు అని అనడం చాలా రొటీన్ డైలాగ్ అయినప్పటికీ, నిజంగా సినిమాని ప్రేమించి నిర్మించే అతికొద్దిమంది నిర్మాతల్లో రాజ్ కందుకూరి ఒకరు.

దీనికి ఉదాహరణే పెళ్ళి చూపులు చిత్రం. ఇండస్ట్రీ పయనిస్తున్న మార్గానికి భిన్నంగా ఒక మంచి కథని ప్రేక్షకులకి అందించాలన్న తపనకి అచ్చమైన రూపం పెళ్ళి చూపులు చిత్రం. పైగా ఈ చిత్రానికి పనిచేసిన ఎవ్వరు స్టార్ వాల్యూ లేనివాళ్ళు అయినాసరే కథని నమ్మి మొత్తం యూనిట్ ని ముందుకు నడిపించిన తెగువ ఆయనలో చూడొచ్చు. వారందరి ప్రయత్నానికి ప్రతిఫలంగా ఆ చిత్రాన్ని జాతీయ అవార్డు వరించడం మనమంతా గర్వించాల్సిన విషయం.

మంచి కథని మించిన స్టార్ ఎవ్వరు లేరు అనే వ్యాఖ్యానికి రాజ్ కందుకూరి రోల్ మోడల్ అని చెప్పొచ్చు. ఇక ఇదే తరహాలో ప్రతిభకి పట్టంకడుతూ మనందరికీ మంచి చిత్రాలు మరిన్ని అందించాలని ఆకాంక్షిస్తూ అలాగే ఆయన నుండి రాబోతున్న చిత్రం మెంటల్ మదిలో చిత్రానికి గుడ్ లక్ చెబుతూ నిర్మాత రాజ్ కందుకూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS