భళా బాహుబలి భళ్లాలదేవా!

మరిన్ని వార్తలు

కెమెరా ఆన్‌ అంటే ఆ ఇద్దరూ బధ్ధ శత్రువులు. కానీ ఆఫ్‌ కెమెరా ఇదిగో ఇలా ఒకరి ఒళ్లో ఒకరు పడుకుని సరదాగా ఆడుకునే మంచి స్నేహితులు. 'బాహుబలి' సినిమా షూటింగ్‌ జరిగినన్నాళ్లూ సెట్‌లో జరిగిన తంతే ఇది, రానా, ప్రబాస్‌ మధ్య. ఇండియన్‌ సినిమా స్థాయిని ఓ రేంజ్‌కి పెంచేసిన సినిమా 'బాహుబలి'. హీరోగా ప్రబాస్‌కీ, విలన్‌గా రానాకి మంచి పేరుతో పాటు, యూనివర్సల్‌ స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. విలన్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, హీరో క్యారెక్టర్‌ అంత ఎలివేట్‌ అవుతుందనడానికి ఈ సినిమాలోని విలన్‌గా రానా క్యారెక్టర్‌, హీరోగా ప్రబాస్‌ క్యారెక్టర్సే నిదర్శనం. వాటి సంగతి పక్కన పెడితే, ఆఫ్‌ స్క్రీన్‌ ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. కానీ సినిమాలో మాత్రం అందరికీ తెలిసిన సంగతే. ఎంతో ఎమోషనల్‌తో కూడిన క్యారెక్టర్స్‌ వీరివి. సహజంగా రాజమౌళి సినిమాల్లో ఆ ఎమోషన్స్‌ పీక్స్‌లో ఉంటాయి. ఆ ఎమోషన్‌ నుండి బయటికి రావడం అంత తేలిక కాదు ఆర్టిస్ట్‌లకు. అయినా కానీ ప్రబాస్‌, రానా మాత్రం, కెమెరా ముందు అలా, కెమెరా ఆఫ్‌ తర్వాత ఇలా సందడిగా గడిపేవారట. తాజాగా 'బాహుబలి - 2' సినిమా బుల్లితెరపై ప్రసారం అయిన సంగతి తెలిసిందే. బుల్లితెరలోనూ ఈ సినిమాకి టీఆర్‌పీ రేటింగ్స్‌ అదరిపోయాయి. ఆ సందర్భంగా ఆడియన్స్‌ని బాహుబలి - భళ్లాలదేవ ఎమోషన్‌ నుండి బయటికి తెచ్చేందుకేమో రానా ఈ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. సినిమా చూశాక, ఈ ఇద్దరినీ ఇలా ఫోటోలో చూసి ఆడియన్స్‌ పిచ్చ హ్యాపీ ఫీలయ్యారు. అంటే వీరిద్దరి మధ్యా స్నేహ బంధం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS