ముద్దు సీన్‌పై బాలయ్య హీరోయిన్‌ హాట్‌ కామెంట్‌.!

మరిన్ని వార్తలు

ముద్దు సీన్లు లేకుండా ఇప్పుడు సినిమాలే ఉండడం లేదు.. అంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా చిన్న సినిమాలకైతే, ముద్దు సీన్లు సక్సెస్‌ సక్సెస్‌ ఆయుధాల్లా మారిపోయాయి. ముద్దంటే అలాంటిలాంటి ముద్దు కూడా కాదు. గాఢమైన 'ముద్దులు' ఇండస్ట్రీని ఏలుతున్నాయిప్పుడు. కొత్తగా వచ్చే ముద్దుగుమ్మలకు, ముద్దు సీన్లలో నటించడం తప్పడం లేదు. పాయల్‌ రాజ్‌పుత్‌ తదితర ముద్దుగుమ్మలు ఈ ముద్దు సీన్లలో హద్దులు దాటేస్తే, కొందరు మాత్రం కొంతవరకూ హద్దుల్లో ఉన్నారు. కానీ, హద్దులు మీరిన ముద్దుల వ్యవహారానికే పట్టం కడుతున్నారు యువత.

 

సరే, అసలు వివరాల్లోకి వెళితే, 'జై సింహా' సినిమాలో 'అమ్మకుట్టీ అమ్మకుట్టీ ఆశపెట్టి చంపకే..' అంటూ బాలయ్యతో కలిసి స్టెప్పులిరగదీసిన ముద్దుగుమ్మ హరిప్రియ గుర్తుంది కదా. గతంలో ఈ బ్యూటీ 'పిల్ల జమీందార్‌' సినిమాలో నాని సరసన నటించింది. ఈ బ్యూటీ ఇప్పుడు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ అమ్మడి మాటల్లో ఆసక్తి కలగడానికి కారణమేంటంటే, ఈ పాప ఇంకో పాపని కెలకడమే. అది కూడా ముద్దు సీన్‌కి సంబంధించి.

 

ఇంతకీ ఎవరా పాప అంటే.. క్రేజీ హీరోయిన్‌ రష్మికా మండన్నా. ఇంకొంచెం డీప్‌గా తెలుసుకుందాం ఉండండి. హరిప్రియ సినిమాలో ఓ ముద్దుసీన్‌ ఉందట. అయితే, అది నిజమైన ముద్దు కాదని చెప్పడానికి, ''గీత గోవిందం' సినిమాలో విజయ దేవరకొండ - రష్మిక మధ్య జరిగిన ముద్దు సీన్‌లాంటిది కాదు.. '' అని పాప ప్రస్థావించింది. అఫ్‌కోర్స్‌ రష్మికా ఒక్కతే కాదు, ఈ మధ్య చాలా మంది ముద్దుగుమ్మలు ముద్దుసీన్లలో నటించేశారు కదా. రష్మికనే ఎందుకు కెలకాలి హరిప్రియ.. అంటూ ఇదేదో పబ్లిసిటీ స్టంట్‌ కోసం చేసిన ట్రిక్కే అని నెటిజన్లు ఆమెపై ఫైర్‌ అవుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS