మరోసారి భయపెట్టనున్న నయన్‌.!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌గా చాలా విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది అందాల తార. కమర్షియల్‌ రోల్సే కాదు, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. హారర్‌, థ్రిల్లర్‌ వంటి జోనర్స్‌లోనూ తనదైన నటన కనబరిచింది. గతంలో 'డోరా', 'మయూరి' వంటి హారర్‌ చిత్రాల్లో నటించి విజయం సాధించిన నయనతార మరో సారి హారర్‌ మూవీతో వస్తోంది. తమిళంలో రూపొందిన ఈ సినిమాని తెలుగులో 'వసంతకాలం' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. టైటిల్‌ ఆహ్లాదంగా ఉంది కానీ, కాన్సెప్ట్‌ చాలా భయపెడుతుందట.

 

నవంబర్‌లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చక్రి తోలేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దామెర వి.ఎస్‌.ఎన్‌. శ్రీనివాస్‌ ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల 'సైరా'తో నయనతార ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సిద్ధమ్మగా సైరా నరసింహారెడ్డి భార్య పాత్రలో కనిపించి, ఆ పాత్రకు తనదైన హుందాతనాన్ని తీసుకొచ్చింది. సిద్ధమ్మగా ఆకట్టుకున్న నయనతార, త్వరలో రానున్న 'వసంతకాలం' సినిమాతో ఎలా భయపెడుతుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS