బిగ్‌హౌస్‌లో రాత్రికి రాత్రి కన్‌ఫ్యూజన్ స్టార్ అవతారమెత్తింది అలేఖ్య హారిక అలియాస్ డేత్తడి హారిక. అసలామెకి ఏమయ్యింది.? ఏ విషయంలో అయినా ధిమాక్‌తో ఆలోచించడంలో అబిజీత్‌తో పోటీ పడే హారిక, ఒక్కసారిగా 'డబుల్ ధిమాక్' ప్రదర్శిస్తూ, తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇదంతా బహుశా అబిజీత్ విషయంలో హోస్ట్ నాగార్జున పీకిన క్లాస్ కారణంగా తలెత్తిన సమస్య అయి వుండొచ్చు. ఫినాలె టెక్కెట్ కోసం జరిగిన పోటీలో హారిక తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. ఆమె హైట్ సహా అనేక కారణాలతో ఈ టాస్క్‌లో ముందుకు వెళ్ళలేకపోయింది హారిక.
నిజానికి, టాస్క్ సందర్భంగా ఏమైనా చేయొచ్చన్నది తొలుత బిగ్‌బాస్ చేసిన ప్రకటన సారాంశం. తొట్టెలో ఎక్కువ పువ్వులు వుండడం అనేది ముందుకు వెళ్ళడానికి అవసరం. అదే సమయంలో, ఇతరుల తొట్టెల్లో తక్కువ పూలు వుండాలి. అంటే, తక్కువ పూలు ఇతరుల తొట్టెల్లో వుండడానికి ఒకే ఒక్క మార్గం.. వాటిల్లోంచి లాగెయ్యడం. ఈ ఐడియా హారికకి బాగానే వచ్చింది.
ఐడియా వచ్చాక ఇంప్లిమెంట్ చెయ్యాలి కదా.? దాని విషయమై ఇతరులతో చర్చించడమే ఆమె చేసిన మొదటి తప్పు. కింద మీదా పడటం ద్వారా ఎలాగూ ఇది ఫిజికల్ టాస్క్ అయిపోయింది. అందులో హారిక చేతులెత్తేసింది. అదేదో, ఇతర తొట్టెల్లోంచి పూలు లాక్కునే వ్యవహారం చేసి వుంటే, గేమ్ మరో టర్న్ తీసుకుని వుండేదే. గత సీజన్లలోనూ ఇలాంటివి జరిగాయి. మరి, హారిక ఎందుకు ఆ రిస్క్ తీసుకోలేకపోయింది.? ఏమో, ఆమెకే తెలియాలి.