ప‌వ‌న్ తో విసిగిపోయిన హ‌రీష్ శంకర్‌

By Gowthami - June 21, 2022 - 12:06 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ అంటే హ‌రీష్ శంక‌ర్‌కు విప‌రీత‌మైన అభిమానం, గౌర‌వం. హరీష్ ఎప్పుడు స్టేజీ ఎక్కినా, మైకు ప‌ట్టినా.. ప‌వ‌న్‌ని పొగ‌డ‌కుండా కింద‌కు దిగ‌డు. మైక్ ఇవ్వ‌డు. ప‌వ‌న్ తో హ‌రీష్ తీసిన గ‌బ్బ‌ర్ సింగ్ ఎలాంటి పూన‌కాలు తీసుకొచ్చిందో తెలిసిందే. ఓ ఫ్యాన్ త‌న హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో గ‌బ్బ‌ర్ సింగ్ తో చూపించాడు హ‌రీష్‌. అప్ప‌టి నుంచీ ఈ కాంబోలో మ‌రో సినిమా ఎప్పుడు వ‌స్తుందా? అని ప‌వ‌న్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూడ‌డం మొద‌లెట్టారు. `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌`తో ఈ కాంబో మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

 

మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన ఎప్పుడో వ‌చ్చేసింది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ... ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు. అదిగో.. ఇదిగో అంటున్నారు త‌ప్ప - ఎలాంటి అప్ డేటూ రాలేదు. ప‌వ‌న్ కోసం ఎదురు చూసీ, ఎదురు చూసీ ఇప్పుడు హ‌రీష్‌కి విసుగొచ్చింద‌ని టాక్. మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కూ ఈ సినిమా మొద‌ల‌య్యేది లేద‌ని తేలిపోవ‌డంతో ఇప్పుడు హ‌రీష్ మ‌రో ఆప్ష‌న్ ఎంచుకొనే ప‌నిలో ప‌డ్డాడ‌ని టాక్‌. ప‌వ‌న్ ఖాళీ అయ్యేలోగా మ‌రో సినిమా పూర్తి చేసుకోవాల‌ని హ‌రీష్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. దిల్ రాజు బ్యాన‌ర్‌లో హ‌రీష్ ఓ సినిమా చేయాల్సివుంది. స్క్రిప్టు ఎప్పుడో రెడీ. ఆరు నెల‌ల్లో ఈ సినిమాని పూర్తి చేసి, అప్పుడు భ‌వ‌దీయుడుని ప‌ట్టాలెక్కించాల‌ని హ‌రీష్ ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. అయితే దీనికి కూడా ప‌వ‌న్ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే.. ప‌వ‌న్ తో హ‌రీష్‌కి ఆల్రెడీ క‌మిట్మెంట్ ఉంది. కాబ‌ట్టి.. ప‌వ‌న్‌కి చెప్పి, మ‌రో ప్రాజెక్టు మొద‌లెట్టాల‌ని హ‌రీష్ భావిస్తున్నాడ‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS