డీజే సినిమా విజయం తరువాత మళ్ళీ అదే కాంబినేషన్ లో పని చేయడానికి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ సిద్ధమైనట్టుగా వీరిరువురు గతంలో ప్రకటించారు.
ఇక ఆ తరువాత నుండి ‘దాగుడుమూతలు’ అనే మల్టీ స్టారర్ కథని సిద్ధం చేసే పనిలో హరీష్ నిమగ్నమయ్యాడు. ఈ కథలో ఇద్దరు హీరోలు ఉండబోతున్నారు అందులో ఒక హీరో పాత్రకి వరుణ్ తేజ్ ని తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఇదే విషయమై దిల్ రాజుని మీడియా వారు ప్రశ్నించగా-
ఆ సినిమా కథ మేము అనుకున్న రీతిలో తయారు కాలేదు అందుకనే ఆ సినిమాని ప్రీ-ప్రొడక్షన్ సమయంలోనే ఆపేసాము అంటూ క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఈ సినిమా ఆగిపోయినంత మాత్రాన తమ కలయికలో ఒక చిత్రం చేయాలి అన్న కమిట్మెంట్ ఏమి మారదు అని త్వరలోనే తమ కలయికలో ఓ చిత్రం ఉంటుంది అని స్పష్టం చేశాడు. తాజాగా దిల్ రాజు బ్యానర్ నుండి యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లవర్ చిత్రం ఎల్లుండి ప్రేక్షకుల ముందుకి రానున్నది.