లూసీఫర్ రీమేక్ చేతులు మారుతుందని టాలీవుడ్ లో గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ మలయాళం రీమేక్ పై చిరంజీవి దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా సుజిత్ ని దర్శకుడని అనుకున్నారు. ఆ తరవాత.. వినాయక్ చేతికి వెళ్లింది. వినాయక్ ఈ కథపై కొంత వర్క్ చేశాడు కూడా. అయితే ఏమైందో.. వినాయక్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
వినాయక్ స్థానంలో ఓ దర్శకుడ్ని వెదికి పట్టుకోవడానికి ఇప్పుడు కసరత్తులు మొదలయ్యాయి. ఆ ఛాన్స్ హరీష్ శంకర్‌కి దక్కే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్. హరీష్ రీమేకుల్ని బాగా తీస్తాడు. గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ అందుకు సాక్ష్యాలు. పైగా చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటే హరీష్‌కి చాలా ఇష్టం. అందుకే.. హరీష్‌కి ఈ ప్రాజెక్టు అప్పగించొచ్చని టాక్. ఇప్పుడైతే.. ప్రాధమికమైన చర్చలు జరుగుతున్నాయి. హరీష్రెడీ అంటే.. ఈ రీమేక్‌కి దర్శకుడు దొరికినట్టే