ఈమధ్య తమన్నాపై బోలెడన్ని రూమర్లు. ముఖ్యంగా తమన్నా పెళ్లి విషయంలో... మీడియా చాలా స్పీడు స్పీడుగా కథనాలు అల్లేస్తోంది. అందులో భాగంగా తమన్నా ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని, పెళ్లి కూడా ఫిక్సయ్యిందని, అందుకే ఈమధ్య సినిమాలు బాగా తగ్గించేసిందని బాలీవుడ్ మీడియా... టాం టాం చేసింది. ఇప్పటి వరకూ ఈ వార్తల్ని చూస్తూ... వదిలేసిన తమన్నా ఇప్పుడు రివర్స్ ఎటాక్ లోకి దిగింది. నా భర్త ఇతనేనా? అంటూ ఇన్‌స్ట్రాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటో చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఎఫ్ 3లో కొన్ని సన్నివేశాల్లో తమన్నా మగాడి గెటప్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. తన భర్త అంటూ కామెంట్ పెట్టడం విశేషం. పెళ్లి రూమర్లకు చెక్ పెట్టడానికే తెలివిగా తమన్నా ఇలా వ్యవహరించింది. సాధారణంగా... ఇలాంటి కామెంట్లని చాలామంది లైట్ తీసుకొంటారు. ఇంకొంతమంది సీరియస్ గా బదులిస్తారు. కానీ తమన్నా మాత్రం వెటకారంగా.. స్పందించింది. గాసిప్ రాయుళ్లకు ఓరకంగా రివర్స్ ఎటాక్ ఇచ్చింది. తమన్నాపెళ్లి మేటర్ అంతా ఉత్తిదే అని ఈ పోస్ట్ తో తేలిపోయింది. మరి అవకాశాలు ఎందుకు తగ్గించుకొంది? లేదంటే.. నిజంగా తమన్నాని దర్శక నిర్మాతలే పట్టించుకోవడం లేదా? అనేదొక్కటీ తేలాల్సివుంది.