బాలీవుడ్ రీమేక్‌తో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ సినిమా అంతవరకూ ఫ్లాప్స్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌కి కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత మెగా కాంపౌండ్ హీరో అయిన స్టైలిష్ స్టార్‌తో హరీష్ శంకర్‌కి కలిసి రాలేదు. 'డీజె' బాగా నిరాశ పరిచింది. హరీష్ లాంటి డైరెక్టర్ 'డీజె' సినిమాని ఎలా తీశాడా.? అని బుర్రలు బద్దలు కొట్టుకున్నారు ఫ్యాన్స్.
అయితే, టైం బ్యాడ్ అది అంతే. ఆ సంగతి అటుంచితే, ప్రస్తుతం హరీష్ శంకర్ మెగా ప్రిన్స్‌నే డైరెక్ట్ చేస్తున్నాడు. వరుణ్‌తో 'వాల్మీకి' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇదంతా తెలిసిందే కొంచెం కొత్తగా చెప్పమంటారా.? కంగారెందుకండీ. 'వాల్మీకి' అలాంటి ఇలాంటి హిట్ కొట్టేలా లేదు మరి. ఖచ్చితంగా బాబాయ్ 'గబ్బర్‌సింగ్'ని కొట్టే సినిమానే అవుతుందని అంచనా వేస్తున్నారు. 'వాల్మీకి' సూపర్ హిట్ అవుతుందనడానికి నిదర్శనం ఈ సినిమాకి కథను రీమేక్ మూవీ నుండి పట్టుకురావడం. తమిళ బ్లాక్ బస్టర్ 'జిగర్తాండ'కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
అయితే, వరుణ్ కోసం చాలానే మార్పులు చేసేశాడులెండి మన క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్. అయితే, వరుణ్ తేజ్ గెటప్పే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. నెగిటివ్ షేడ్స్‌తో వరుణ్ పండించే కామెడీ, సినిమాకి మరో ఆకర్షణ. ప్రస్తుతం శరవేగంగా అనంతపురంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. పూజాహెగ్దే హీరోయిన్ కాగా, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. సెప్టెంబర్ 6న 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.