పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ సినిమా `భవదీయుడు భగత్ సింగ్` ఎప్పుడో పట్టాలెక్కాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. హరీష్ శంకర్ ని ఎప్పుడు అడిగినా `త్వరలోనే ఈ సినిమా ఓ బ్లాస్ట్ లా మొదలవుతుంది` అని చెబుతూనే ఉంటాడు. కానీ.. ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేటూ లేకుండా పోయింది. ఇప్పుడు ఈగో క్లాష్ తో ఈ సినిమా మొత్తానికే ఆగిపోయే ప్రమాదంలో పడిందని టాక్. దానికి కారణం.. ఓ రకంగా త్రివిక్రమ్ అని వినికిడి.
పవన్ కల్యాణ్ ప్రాజెక్టుల్లో త్రివిక్రమ్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఈ మధ్య మరీ ఎక్కువైంది. భీమ్లా నాయక్ సినిమాని సెట్ చేసింది త్రివిక్రమే. ఇప్పుడు సముద్ర ఖని సినిమానీ ఆయనే పట్టాలెక్కిస్తున్నారు. పవన్ చేసే ప్రతీ కథనీ త్రివిక్రమ్ కూడా వింటున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇటీవల హరీష్ ని పిలిచిన పవన్ `ఈకథని ఒక్కసారి త్రివిక్రమ్‌కి వినిపించు` అని సలహా ఇచ్చాడట. కానీ దానికి హరీష్ `నో` చెప్పాడని టాక్.
మార్పులు చేర్పులూ కావాలంటే మీరు చెప్పండి. అంతే తప్ప మరో దర్శకుడికి నా కథ వినిపించను.. అని హరీష్ తెగేసి చెప్పాడట. దాంతో.. పవన్ హర్టయ్యాడని, ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడని వార్తలు వినవస్తున్నాయి. ఇదెంత నిజమో తెలీదు గానీ, ఓ దర్శకుడు తాను సినిమా తీస్తూ, మరో దర్శకుడికి కథ వినిపించాలనుకోవడం ముమ్మాటికీ... తప్పే. ఎవరి జడ్జ్‌మెంట్ వాళ్లకుంటుంది. ఈ విషయంలో హరీష్ చేసిందే న్యాయం అనిపిస్తోంది. మరి పవన్ ఏం చేస్తాడో?