పవన్ కల్యాణ్ అరి వీర భయంకర భక్తుల్లో హరీష్ శంకర్ ఒకడు. గబ్బర్‌సింగ్‌తోనే తన ప్రేమనంతా చూపించేశాడు. అందుకే పవన్ కల్యాణ్ అభిమానుల గుండెల్లో హరీష్ స్థానం సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు మళ్లీ పవన్ - హరీష్ కాంబో ఖాయమైంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే మైత్రీ మూవీస్ నిర్మాతలకు హరీష్ లైన్ చెప్పేశాడట. అది మైత్రీ నిర్మాతలకూ బాగా నచ్చేసిందని టాక్.
ఇదో పొలిటికల్ డ్రామా అని సమాచారం. ఈ కథలో పవన్ కల్యాణ్ సీఎమ్‌గా కనిపించనున్నాడట. హీరోలు సీఎమ్‌లుగా మారిన కథలు తెలుగునాట కొత్త కాదు. ఒకే ఒక్కడు నుంచి మహర్షి వరకూ అలాంటి కథలు బాగా పండాయి కూడా. పవన్‌కి ఉన్న పొలిటికల్ మైలైజీ దృష్ట్యా ఈ కథ బాగా వర్కవుట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ కథ పవన్‌కి వినిపించాలి, తనకు నచ్చాలి.. ఆ తరవాతే ఓకే అవ్వాలి. మరి.. పవన్ ఏమంటాడో చూడాలి.