విశ్వరూపం 2 విడుదలకి ముహూర్తం పెట్టేశారు

By iQlikMovies - June 11, 2018 - 13:23 PM IST

మరిన్ని వార్తలు

లోకనాయకుడు కమల్ హాసన్ చిత్రాలకి విడుదల సమయంలో ఎదురయ్యే కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు ఆయన ప్రతి సినిమాకి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉంటాయి, విశ్వరూపం 2 చిత్రం కూడా ఇందుకు మినహాయింపేమి కాదు.

అయితే ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక తాజా ప్రకటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అదేంటంటే- ఈరోజు సాయంత్రం విశ్వరూపం 2 ట్రైలర్ విడుదలవుతుండడం అలాగే ఈ చిత్రం ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్టుగా సమాచారం.

ఇక ఈ ట్రైలర్ ని హిందీలో సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇక్కడ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయనుండడంతో విడుదలకి ముందే ఈ ట్రైలర్ పైన అందరి దృష్టి పడింది. దీనితో ఈ చిత్రం మొదటి పార్ట్ కన్నా పెద్ద హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.

చూద్దాం.. ఇంకొన్ని గంటల్లో ఈ ట్రైలర్ మన ముందుకి రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS