హరీష్‌ శంకర్‌ని ఏకిపారేశారుగానీ.!

మరిన్ని వార్తలు

దర్శకుడు హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటాడు. ఆయన పోస్టింగ్స్‌ హార్ట్‌ టచ్చింగ్‌గా వుంటాయి.. ఆలోచింపజేస్తాయి. పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమాని కావడంతో, హరీష్‌ శంకర్‌ని టార్గెట్‌ చేసే ‘హేటర్స్‌’ సోషల్‌ మీడియాలో చాలా ఎక్కువే. ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో హరీష్‌ శంకర్‌ పోస్ట్‌ చేయడంతో, హేటర్స్‌ రెచ్చిపోయారు. హరీష్‌ శంకర్‌ని ఏకి పారేశారు. ‘తెలిసే పెట్టావా.? ఇది నాసా ఫొటో అని నీకెవరు చెప్పారు..?’ అంటూ దుమ్మెత్తిపోసేశారు. పవన్‌ కళ్యాణ్‌ని సీన్‌లోకి లాగి, హరీష్‌ శంకర్‌ని నానా తిట్లూ తిట్టేశారు. ‘ఆయన అభిమాని కదా.. ఇంతకన్నా జ్ఞానం ఎలా వస్తుంది.?’ అని కొందరు ఎద్దేవా చేశారు.

 

కానీ, హరీష్‌ శంకర్‌ అందరికీ గట్టిగానే రిప్లయ్‌ ఇచ్చాడు. ‘ఫొటో నచ్చి పెట్టాను తప్ప.. అది నాసా ఫొటో అని చెప్పలేదు..’ అంటూ వివరణ ఇచ్చాడు. దాంతో, హేటర్స్‌కి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ‘ఒరేయ్‌ బాబులు.. ఇది నాసా పిక్‌ కాదు.. నాకు నచ్చిన పిక్‌ అని పెట్టా.. ఉండాల్సినోళ్ళురా బాబూ మీరు..’ అని హరీష్‌ పెట్టిన పోస్ట్‌, వైరల్‌గా మారింది. నిన్న దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇళ్ళల్లో లైట్లన్నీ ఆర్పేసి, దేశ ప్రజానీకం దీపాలు వెలిగించిన విషయం విదితమే. దానికి సంబంధించి పుట్టుకొచ్చిన వివాదమిది. హేటర్స్‌.. ఎంత కక్కుర్తిగాళ్ళో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS