ఇటీవలే 'గద్దలకొండ గణేష్' సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు హరీష్ శంకర్. విషయమున్న దర్శకుడే. కానీ, అప్పుడప్పుడూ వివాదాలకూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతుంటాడు. అయినా విషయమున్న ట్వీటులే వేస్తాడనుకోండి. తాజాగా హరీష్ శంకర్ వేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. 'నేనూ గెలవాలి.. నేనే గెలవాలి.. నేను గెలవాలి..' అంటూ అర్ధమయ్యీ అర్ధమవ్వనట్లుగా ఓ ట్వీట్ వేశాడు హరీష్ శంకర్. ఈ ట్వీట్‌ని ఎవరికి వారు ఎవరికి నచ్చినట్లు వారు ఆపాదించేసుకుంటున్నారు. ఈ సంక్రాంతి సినిమాలకు సంబంధించిన ట్వీట్ అని కొందరనుకుంటే, లేటెస్ట్‌గా జగన్ ప్రభుత్వంలో జరిగే రాజకీయాలపై అని మరికొందరనుకుంటున్నారు.
లేదు, లేదు లేదు.. ఇంకేదో అర్ధముండే ఉంటుంది.. అంటూ ఇంకొందరు భావిస్తున్నారు. మొత్తానికి భలే తెలివిగా ట్వీటినాడు కానీ, అందులోని అసలు అర్ధం, ఆయన మనసులోని పరమార్ధం మాత్రం ఎవ్వరికీ అర్ధం కాకుండా వేశాడు. ఇదిలా ఉంటే, హరీష్ శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, గతంలో 'దాగుడుమూతలు' అనే ప్రాజెక్ట్‌ని యంగ్ మల్టీస్టారర్‌గా రూపొందించాలని అనుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి నితిన్, శర్వానంద్, నాని తదితర హీరోల కాంబినేషన్స్ ప్రచారంలోకి వచ్చాయి కూడా. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆగిపోయింది.
'గద్దలకొండ గణేష్' కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉంది. కానీ జరగలేదు. 'గద్దలకొండ' వంటి సూపర్ హిట్ కొట్టాక, హరీష్ తదుపరి ఏ హీరోపై ఖర్చీఫ్ వేశాడో తెలీదు కానీ, సినిమా సంగతి పక్కన పెట్టేసి, ప్రస్తుతానికి ఇదిగో ఇలా ట్వీట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు.