సినిమాల్లోని పాటలు టైటిల్స్‌గా రావడం కొత్తేమీ కాదు. తన సినిమాలోని తన పాటనే తన కొత్త సినిమా టైటిల్‌గా పెట్టేసుకోవాలని ఫిక్సయ్యాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్. 'డిజె' తర్వాత హరీష్ శంకర్ 'దాగుడుమూతలు' అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ చేయబోయే సినిమా పేరు 'సీటీమార్'.
అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. గతంలో ఈ బ్యానర్లో 'జవాన్' సినిమా వచ్చింది. ప్రస్తుతం 'దాగుడుమూతలు' సినిమా పనుల్లో బిజీగా వున్న హరీష్ శంకర్, సైమల్టేనియస్‌గా 'సీటీమార్' స్క్రిప్ట్‌ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్‌లో హరీష్ శంకర్‌ది డిఫరెంట్ యాటిట్యూడ్. అతని సినిమాల్లో హీరో ఎంత పవర్‌ఫుల్‌గా వుంటాడో అందరికీ తెల్సిందే. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలోనే కాదు, కుటుంబ విలువలతో సినిమాలు తీయడంలోనూ దిట్టగా పేరు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్.
'డిజె' ఆశించిన మేర విజయాన్నివ్వకపోయినా, ఆ సినిమా టాక్ని మించి వసూళ్ళను సొంతం చేసుకుంది. ఆ సినిమా విషయంలో అల్లు అర్జున్ స్టామినాతోపాటు, హరీష్ శంకర్ ఎనర్జీ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. పవన్‌కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్' సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్, పవన్‌తోనే ఇంకో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ఆ అవకాశం దక్కుతుందన్న ధీమా ఆయనలో వుందిగానీ, పవన్ మాత్రం సినిమాలకు గ్యాప్ ఇచ్చి, రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెల్సిందే. 'డిజె' సినిమాలోని 'సీటీమార్' పాటని, తన టైటిల్‌గా పెట్టుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తానంటోన్న హరీష్ శంకర్, ఆ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకోవాలని ఆశిద్దాం.