విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య కలయికలో ఒక మల్టీ స్టారర్ చిత్రం రానుంది అన్న సంగతి విదితమే.
అయితే ఈ చిత్రానికి సంబందించిన ఒక కీలక సమాచారం వెలుగులోకొచ్చింది. అదేంటంటే- ముందు నుంచి అనుకుంటున్నట్టుగా ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించడం లేదట. ఆయన స్థానంలో మరో యువ దర్శకుడు అయిన బాబీ ఈ చిత్రాన్ని తీయనున్నాడట.
ఇక ఈ చిత్రం ఎప్పుడు మొదలవ్వనుంది అన్నది ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతం వెంకీ, చైతులు తమ తమ సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకొంతకాలం పట్టొచ్చు అని వినికిడి.
ఏదైతేనేమి.. ఈ మామ-అల్లుడుల చిత్రం సినీ అభిమానులకి పండగనే చెప్పాలి.