రవితేజ 'షాక్'తో దర్శకుడిగా పరిచయమై, 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని, స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరుగా ఎదిగిన హరీష్ శంకర్ పరిస్థితి ఇప్పుడు లో బడ్జెట్‌కి పడిపోయిందట. అల్లు అర్జున్‌తో 'డీజె' పరాజయంతో హరీష్ శంకర్‌ని ఎవ్వరూ లెక్క చేయడం లేదని టాక్ వినిపిస్తోంది.
ఒక్క పరాజయంతో డైరెక్టర్స్ వేల్యూ పడిపోతుందనడంలో నిజం లేదు కానీ, ప్రస్తుతం ఎందుకో హరీష్ శంకర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. యంగ్ హీరోలతో 'దాగుడు మూతలు' పేరుతో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మల్టీ స్టారర్‌ని రూపొందించనున్నాడనీ అప్పట్లో ప్రచారం బాగా జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు. నితిన్ - శర్వానంద్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందించాలనుకున్నాడు హరీష్ శంకర్. ఈ మల్టీ స్టారర్‌కి దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారనన సంగతి కూడా అప్పట్లో విదితమే.
అయితే ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు దిల్‌రాజు కూడా సుముఖంగా లేరనీ తాజాగా అందుతోన్న సమాచారమ్. అయితే హరీష్ శంకర్ పరిస్థితి ఏంటీ? అంటే మరో కొత్త ప్రాజెక్టుకు పావులు కదుపుతున్నాడట హరీష్ శంకర్. అదీ ఓ యంగ్ హీరోతో అని తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చిందట. ఈ సినిమాలో నటించబోయే ఆ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని అంటూ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
14 రీల్స్ సంస్థలో నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' చిత్రం మంచి విజయం అందుకుంది. సో ఇది ఫైనల్ అయితే నానితో హరీష్ శంకర్ హిట్ కొడతాడా? అనేది చూడాలిక.