గద్దల కొండ గణేష్ తో వరుణ్ తేజ్ మేకొవర్ అదిరిపోయింది. నెగిటీవ్ టచ్ ఉన్న పాత్రలో అద్భుతంగా రాణించాడు వరుణ్. నిజానికి ఆ పాత్రని వరుణ్ అంతలా రక్తికట్టిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు హరీష్ శంకర్ కే దక్కుతుంది. జిగర్తాండకు ఇది రీమేక్. వరుణ్ కెరీర్‌లో మంచి హిట్ గా నిలబడిపోయింది. ఇప్పుడు మళ్లీ.. ఈ కాంబోలో ఓ సినిమా రాబోతోందని టాక్. బుధవారం వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చూస్తే... ఈ కాంబోలో మరో సినిమా రావడం పక్కా అని తేలిపోయింది.
`జిగర్తాండ`లోని బాబీ సింహ పాత్రలో నిన్ను ఊహించుకున్నప్పుడు నాకు తెలియదు... నువ్వు ఆ పాత్రను ఎంతో కష్టపడి ఆ స్థాయిలో రక్తికట్టిస్తావని.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం నాకు ఎప్పుడూ ఆనందం కలిగిచే విషయం. నీతో మరోసారి వర్క్ చేయడానికి ఎదరుచూస్తున్నాను` అని ట్వీట్ చేశారు హరీష్. అంటే... ఈ కాంబోలో సినిమా గ్యారెంటీ అన్నమాట. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో `భవదీయుడు... భగత్ సింగ్` అనే సినిమా చేస్తున్నాడు హరీష్. ఆ తరవాత.. ఈ కాంబో పట్టాలెక్కొచ్చు.