24 కిస్సెస్ విడుదలకు ముందు మంచి క్రేజే తెచ్చుకుంది. హెబ్బా పటేల్ కథానాయిక కావడం, టైటిల్ ఆసక్తిగా ఉండడం, ప్రచారచిత్రాలు స్పైసీ స్పైసీగా సాగడం, దానికి తోడు ఈమధ్య బోల్డ్‌కంటెంట్‌కి కాసులు రాలుతుండడంతో... 24 కిస్సెస్‌కి ఓ రేంజు ఓపెనింగ్స్ వస్తాయనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
ఆంధ్రా తెలంగాణాలలో కనీసం ఓపెనింగ్స్ లేవు. 30 శాతం కూడా టికెట్లు తెగని పరిస్థితి. సినిమా బాగుంటే... ఫస్ట్ షో నాటికి కలక్షన్లు పుంజుకుందును. నెగిటీవ్ రివ్యూలు రావడంతో పాటు... మౌత్ టాక్ కూడా నీరసంగానేఉండడంతో.. 24 కిస్సెస్‌ని పక్కన పెట్టేశారు ఆడియన్స్. అన్నింటికి మించి టాక్సీవాలా.. జోరు ఎక్కడా తగ్గకపోవడంతో హెబ్బాపటేల్ సినిమాకి దెబ్బడిపోయింది. కుమారి 21 ఎఫ్‌లా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని, మెల్లగా ఈసినిమా నిలబడిపోతుందని చిత్రబృందం భావించింది.
అయితే.. కంటెంట్‌లో విషయం లేకపోవడంతో, దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ మిస్సవ్వడంతో.. ఈ సినిమా ఫలితం బోర్లా పడింది. హెబ్బా లాంటి హాట్ భామ, కొన్ని ముద్దు సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు.. కథలో విషయం ఉండాలంతే అనే విషయాన్ని 24 కిస్సెస్ మరోసారి నిరూపించింది.