వెబ్‌లో 'హెబ్బా' ముద్దు ముచ్చట.!

By Inkmantra - December 21, 2019 - 18:38 PM IST

మరిన్ని వార్తలు

స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో మెరిసిపోవాలని ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు డిజిటల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా సెలబ్రిటీలతో రకరకాల వెబ్‌ సిరీస్‌లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. సీనియర్లే అలా ఉంటే, ఇక జూనియర్స్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ వెబ్‌ సిరీస్‌పై మనసు పారేసుకుంది. ఎవరా ముద్దుగుమ్మ.? అంటే, 'కుమారి'. అదేనండీ 'కుమారి 21 ఎఫ్‌'తో తెరంగేట్రం చేసిన హాట్‌ బ్యూటీ హెబ్బా పటేల్‌. అజయ్‌ భూయాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ వెబ్‌ సిరీస్‌లో హెబ్బా నటిస్తోందని తాజా సమాచారం. ఈ వెబ్‌ సిరీస్‌లో నవదీప్‌, బిందు మాధవి, చాందినీ చౌదరి తదితరులు నటిస్తున్నారు.

 

వెండితెరపై ఓ మోస్తరు సక్సెస్‌తో ఓకే అనిపించుకున్న హెబ్బా పటేల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో తన టాలెంట్‌ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి మరి. ఇక ప్రస్తుతం హెబ్బా పటేల్‌ ఏమంత ఖాళీగా లేదు. నితిన్‌ హీరోగా నటిస్తున్న 'భీష్మ' చిత్రంలో హెబ్బా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే రాజ్‌ తరుణ్‌తో 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రంలోనూ హెబ్బా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS