'హలో గురూ..' సందడేది గురూ.!

మరిన్ని వార్తలు

దసర సీజన్‌కి 'అరవింద సమేత..'తో బోనీ కొట్టేశారు. మంచి బోనీ కూడా. ఇక ఈ బరిలో ఉన్న మరో సినిమా యంగ్‌ హీరో రామ్‌ నటించిన 'హలో గురూ ప్రేమ కోసమే'. అక్టోబర్‌ 18న ఈ సినిమా విడుదల కానుంది. అంటే సరిగ్గా ఐదు రోజులు మాత్రమే ఉంది రిలీజ్‌కి. అయితే ఎక్కడా సినిమా ప్రమోషన్స్‌ సందడి కనిపించడం లేదు. 

మొన్న ట్రైలర్‌ విడుదల చేసి కామ్‌గా ఊరుకున్నారంతే. ఇంకెక్కడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ హడావిడి లేదు. అసలే ఓ పక్క 'అరవింద సమేత..' సినిమా పోజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతూ, అందిన చోట ప్రమోషన్స్‌నీ వదిలి పెట్టడం లేదు చిత్ర యూనిట్‌. ఇటు సోషల్‌ మీడియాలోనూ, అటు ప్రింట్‌ మీడియాలో కూడా 'అరవింద..' సందడి ఓ రేంజ్‌లో సాగుతోంది. ఈ తరుణంలో మరి 'హలో గురూ..' టీమ్‌ ఇంకెంత అలర్ట్‌గా ఉండాలో కదా. కానీ హీరో రామ్‌ కానీ, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ కానీ, డైరెక్టర్‌ నక్కిన త్రినాధరావు కానీ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. 

సినిమా ప్రోమోస్‌ కూడా సందడి చేయడం లేదు. అసలే రామ్‌ కెరీర్‌ ఏమంత జోరుగా లేదు. ఎందుకు రామ్‌ సైలెంట్‌గా ఉన్నాడో అభిమానులకు తెలియడం లేదు. ఇదిలా ఉంటే, తమిళ హీరో విశాల్‌ నటిస్తున్న 'పందెం కోడి 2' చిత్రం కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. 'హలో గురూ..'తో పోల్చితే ఈ సినిమా ప్రమోషన్స్‌ అదిరిపోతున్నాయి. 

కీర్తిసురేష్‌ డైలాగుల క్లిప్పింగ్స్‌, విశాల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ క్లిప్పింగ్స్‌తో మోత మోగించేస్తున్నారు. సో 'హలో గురూ..' టీమ్‌ కాస్త జోరు పెంచాలి గురూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS