ఈ దసరా సీజన్ సినిమాల పరంగా అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో ఒక వారం ముందుగానే మొదలైనప్పటికి పండగ రోజున మాత్రం ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమా మరొక తమిళ డబ్బింగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
ముందుగా స్ట్రెయిట్ సినిమా అయిన హలో గురు ప్రేమ కోసమే గురించి మాట్లాడుకుందాం.. ఫ్లాప్ తో వెనుకపడిన రామ్ కి ఈ చిత్ర విజయం తప్పనిసరి అదే సమయంలో నిర్మాత దిల్ రాజు కి కూడా ఈ సినిమా యొక్క రిజల్ట్ ఎంతగానో ముఖ్యం అని చెప్పక తప్పదు.
ఈ తరుణంలో విడుదలైన చిత్రానికి ‘పర్వాలేదు’ అన్న టాక్ సంపాదించుకోగలిగింది. కథనంలో కొత్త కొత్త మలుపులతో చేసిన ఈ కథకి ప్రధాన తారాగణం అయిన రామ్, ప్రకాష్ రాజ్ లు ప్రాణం పోశారు అని చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూనే అంతర్లీనంగా భావోద్వేగాలతో కూడిన కథని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకడు.
మొత్తానికి పండగ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే వినోదంతో పాటు సెంటిమెంట్ ని ఈ సినిమా ద్వారా అందివ్వగాలిగారు.
ఇక విడుదలైన రెండవ చిత్రం పందెంకోడి 2. దాదాపు 13 ఏళ్ళ క్రితం విడుదలైన పందెంకోడి చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. పందెంకోడి సినిమా కథ ఆ రోజుల్లో ఒక వైవిధ్యంగా నిలిచింది. దీనికి కారణం- కథనంలో కొత్తదనం, ముఖ్యంగా ప్రతినాయకుడు పాత్ర చిత్రీకరణ ఇలాంటి మరికొన్ని అంశాలు పందెంకోడిని విజయవంతం చేసేలా చేశాయి.
తాజాగా విడుదలైన చిత్రంలో అప్పటి కథలో ఉన్న బలం కాని కథనంలో ఉన్న పట్టు కాని పందెంకోడి 2లో లేవు. ఇదే ప్రధాన సమస్యగా ప్రేక్షకులని మెప్పించడంలో ఈ చిత్రం వెనుకపడింది. అయితే ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ అంటూ చెబుతూ వస్తున్న వరలక్ష్మి చేసిన పాత్ర సినిమా చూసాక మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి.
పందెంకోడితో తెలుగునాట ఒక స్థానం సంపాదించుకున్న విశాల్ కి మాత్రం ఈ చిత్రం అంతగా లాభాన్ని చేకూర్చలేకపోయింది.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.