'బుర్రకథ'లో ఆది ఫస్ట్‌లుక్‌ చూశారా.?

By iQlikMovies - April 11, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. కానీ సరైన హిట్‌ పడడం లేదు. 'లవ్‌లీ' తదితర చిత్రాలతో ఓ మోస్తరుగా ఆకట్టుకున్నా ఆదికి అసలు సిసలు మాస్‌ హిట్‌ పడాల్సిందే.

 

ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి సీరియస్‌ మూవీ 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో ఆది పవర్‌ఫుల్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆది నటిస్తోన్న మరో చిత్రం ఫస్ట్‌లుక్‌ని తాజాగా విడుదల చేశారు. అదే 'బుర్రకథ'. ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కాన్సెప్ట్‌. కాన్సెప్ట్‌ని బట్టి ఇదేదో సీరియస్‌ మూవీ అనుకునేరు. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ అట. సీరియస్‌ కాన్సెప్ట్‌కి హెల్దీ కామెడీని జోడించి తెరకెక్కించబోతున్నారు డైమండ్‌ రత్నబాబు. ఈయన ప్రముఖ మాటల రచయితగా సుపరిచితుడు. ఈ సినిమాతోనే మెగాఫోన్‌ పట్టబోతున్నాడు. డైమండ్‌ గారి తొలి ప్రయత్నం ఫలించాలనీ, ఆదికి మంచి విజయం వరించాలనీ ఆశిద్దాం. ఈ సినిమాలో 'చిన్నదానా నీ కోసం' ఫేమ్‌ మిస్తీ చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. మరో భామకూ చోటుంది ఈ సినిమాలో.

 

ఆ ప్లేస్‌లో నైరాషా నటిస్తోంది. ఆది రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపిస్తున్న 'బుర్రకథ' తాజా ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS