#METOO అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. తాజాగా హీరో అర్జున్ పైన కన్నడ నటి శృతి హరిహరన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు కన్నడ చిత్రపరిశ్రమలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ అంశంలో ఇరు వైపులా ఆరోపణల పర్వంతో పాటు పోలీసు కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. నిన్నటి రోజున శృతి బెంగుళూరు లోని కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ లో అర్జున్ పైన ఫిర్యాదు చేసింది. దీనితో ఆయన పైన కేసు నమోదు చేశారు.
అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన ఇటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న ఈ సమయంలో ఆయన పైన పోలీసులు చర్యలు తీసుకుంటారు అన్న టాక్ వినవస్తున్నది. అర్జున్ తో కలిసి ఒక చిత్రం చేస్తున్న సమయంలో తనని చాలా ఇబ్బందులకి గురిచేశాడు అని ఆమె పేర్కొన్న ఫిర్యాదులో ఉంది.
మరోవైపు.. అర్జున్ కూడా నటి శృతి పైన ఫిర్యాదు చేయడం తో పాటు రూ 5కోట్ల వరకు పరువునష్టం దావా వేశాడు.