గోవిందుడి గారడీ మామూలుగా లేదండోయ్‌.!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైపోయాడు. ఆగష్టు 15న అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు 'గీత గోవిందం' సినిమాతో. యూత్‌లో విజయ్‌ దేవరకొండకు చాలా ఫాలోయింగ్‌ ఉంది. ఈ ఫాలోయింగ్‌తోనే ఈ సినిమా విజయంపై చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు విజయ్‌ దేవరకొండ. సినిమా ప్రమోషన్స్‌ కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాడు. 

ఎక్కడికక్కడ తన మాటల గారడీతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని పైరసీ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. అయితే మనోడు పైరసీ విషయంలో ఏమన్నాడో తెలుసా? పైరసీ గురించి ఇంక ఏం మాట్లాడినా వేస్ట్‌ అన్నాడు. ఆ పైరసీ చేసే వాళ్లకే తెలియాలది అని వారి విజ్ఞతకే వదిలేశాడు. ఒక సినిమాని తెరకెక్కించాలంటే యూనిట్‌ అంతా ఎంత కష్టపడాలో ఆ కష్టం విలువ పడుతున్న మాకే తెలుసు. పైరసీ చేసేవాళ్లకి ఏం తెలుస్తుందిలే అన్నట్లుగా పైరసీ బాబులకు చురకలు అంటించాడు. 

ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ విడుదల చేస్తున్న పోస్టర్స్‌, ప్రోమో వీడియోలు ఎంతగా ఆశక్తిని కనబరుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పైరసీ వీడియోలు కూడా నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇవి కూడా మరో రకంగా సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడుతున్నా, చిత్ర యూనిట్‌లో మాత్రం గందరగోళం నెలకొంది. ఈ పైరసీ బూతం ఇంకెంత దూరం తీసుకెళ్తుందో. దాని ఎఫెక్ట్‌ చిత్ర విజయంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనంటూ క్షణం క్షణం ఆందోళన చెందుతోంది. 

చూడాలి మరి, ఈ పైరసీ బూతాన్ని తట్టుకుని గోవిందుడి నవ్వుల గారడీ ఎంత మేర నిలదొక్కుకుంటుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS