చిరంజీవి 152వ చిత్రంలో మహేష్ బాబు నటిస్తాడా, లేదా? అనే ఉత్కంఠతకు తెరపడింది. ఈ చిత్రంలో మహేష్ నటించడం లేదు. ఆ స్థానంలో రామ్ చరణ్ కనిపించనున్నాడు. నిజానికి చిరు, చరణ్ కలిసి నటిస్తారనే ప్రచారం ముందు నుంచీ జరుగుతూనే ఉంది. కాకపోతే.. ఆర్.ఆర్.ఆర్ ఆలస్యం అవ్వడంతో, చరణ్ ఈ సినిమా చేస్తాడో, లేదో అనుకున్నారు. మరో మార్గంగా మహేష్ బాబు పేరు చర్చల్లోకొచ్చింది. కొరటాల శివ మహేష్‌ని కలిసి కథ చెప్పాడు కూడా. మహేష్ కూడా సానుకూలంగానే స్పందించాడు. రోజుకి కోటి రూపాయల చొప్పున 30 రోజులకు 30 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారు. అన్నీ ఓకే అనుకున్న తరుణంలో మళ్లీ కన్‌ఫ్యూజన్ మొదలైంది.
ఈ సినిమాని మహేష్ చేస్తాడా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చివరికి అనుమానాలే నిజం అయ్యాయి. మహేష్ ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యాడు. చరణ్ కే ఆ పాత్ర ఫిక్స్ అయ్యింది. చరణ్ మళ్లీ రేసులోకి రావడానికి చాలా కారణాలున్నాయి. మహేష్ నటిస్తే.. జనంలో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువ అవుతాయి. దానికి తోడు.. బడ్జెట్ పెరుగుతుంది. మహేష్ పాత్ర అటూ ఇటుగా ఉన్నా - ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోయినా మహేష్ ఫ్యాన్స్ హర్టవుతాయి. అది మొదటికే మోసం తెస్తుంది. అందుకే... మహేష్‌ని పక్కన పెట్టాల్సివచ్చిందని సమాచారం.