రవితేజ, బాలకృష్ణ ఇద్దరూ ఒక్కటే ఎప్పుడు ఎవరికి అవకాశం ఇస్తారో చెప్పలేం. కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పుడు రవితేజ మరో షాక్ ఇచ్చాడు. ఓఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి - తన స్టైల్ చూపించాడు. నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తాడు వక్కంతం వంశీ. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. రచయితగా కూడా వక్కంతం కెరీర్ బాగా డల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఆయనకు మరో ఛాన్స్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. తీరా చూస్తే ఇప్పుడు రవితేజ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అవును... వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే కథ పూర్తయింది. అది రవితేజకు నచ్చడం, పచ్చ జెండా ఊపేయడం జరిగిపోయాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. ప్రస్తుతం `క్రాక్` సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేతిలో ఉన్నాయి.