విభిన్న కథలను ఎంచుకోవడమే కాదు, వ్యక్తిగతంగానూ విభిన్నంగానే ఆలోచిస్తుంటాడు మంచు మనోజ్. సొసైటీకి సంబంధించిన పలు ఇష్యూస్‌పై స్పందిస్తూ, సోషల్ మీడియాలో స్పందిస్తుంటాడు మనోజ్. అభిమానుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, చాలా యాక్టివ్‌గా ఉంటుంటాడు.
తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ ఆలోచింపచేసేలా ఉంది. మహిళల సెక్యూరిటీకి సంబంధించి మన భారతదేశం చాలా వెనకబడి ఉంది. ప్రపంచంలోనే మహిళలకు ప్రమాదకరమైన దేశాల్లో భారతదేశం ముందు స్థానంలో ఉందనీ లండన్‌కు చెందిన థామ్సన్ రాయిటర్స్ సర్వే సంస్థ తెలిపింది. మహిళలపై వివక్ష, లైంగిక వేధింపులు, శ్రమ దోపిడీ తదితర అంశాల్లో భారత్ ముందుందనీ ఈ సర్వే వెల్లడించింది. సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉందనీ తెలిపింది. ఈ విషయం తెలిసి మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
భారతదేశం గొప్ప సంస్క్తృతులకు నెలవు. అలాంటిది ఈ మధ్య దేశంలో మహిళలపై ఘోరమైన లైంగిక వేధింపులు అత్యాచారాలు, పెరిగిపోయాయి. ప్రతీ రోజు ఏ మూల విన్నా వార్తల్లో ఇవే ముందు ప్లేస్‌లో ఉంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న మన భారతదేశ ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న ఈ అకృత్యాలకు అడ్డు కట్ట వేయలేకపోతోందే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, భారత్‌ను సురక్షిత దేశంగా మార్చాలంటే కేవలం ప్రభుత్వాలే కాదు, మనమంతా నడుం బిగించాలి. పరిస్థితిలో మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలి.. అని మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
నిజమే ఇది ఆలోచించాల్సిన విషయమే. ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా ఈ అకృత్యాలకు చిద్రమైపోతున్నారు. ఇటీవల ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య అందర్నీ కలిచి వేసింది. ఇలాంటివి ఒక్కటి కాదు ఎన్నో వెలుగు చూశాయి ఈ మధ్య. దీన్ని ఆపడం, పరిస్థితిలో మార్పు తీసుకురావడం సాధ్యమేనా? కష్టమే కానీ ప్రయత్నం అయితే జరగాలి కదా.