'ఇస్మార్ట్‌ శంకర్‌' వచ్చేస్తున్నాడు అదేంటీ?

మరిన్ని వార్తలు

'ఇస్మార్ట్‌ శంకర్‌' వచ్చేశాడు.. కదా అనుకుంటున్నారా? సినిమా కాదండీ, మన ఇస్మార్ట్‌ శంకర్‌ రామ్‌ ఇంతవరకూ విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమా ఇలా రిలీజయ్యింది. అలా ఆయన విదేశీ టూర్‌ చెక్కేశారు. ఈ టూర్‌ విషయంలో పలు అనుమానాలు, గాసిప్స్‌ కూడా పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ టూర్‌ని రామ్‌ ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాడట.

 

నిజానికి 'ఇస్మార్ట్‌ శంకర్‌' జూలై 12న విడుదల కావాల్సి ఉంది. కానీ, వరల్డ్‌ కప్‌ రీజన్‌తో ఈ సినిమాని వాయిదా వేశారు. దాంతో రామ్‌ ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు వీలు పడలేదు. అయితే, సినిమా మంచి విజయం అందుకుంది. భారీ వసూళ్లు కొల్లగొట్టింది. విడుదలై ఇన్ని రోజులు కావస్తున్నా, 'ఇస్మార్ట్‌ శంకర్‌' వసూళ్లు నిలకడగా ఉండడం, బజ్‌ బాగుండడంతో, ఈ టైమ్‌ని నిర్మాతలకు మరింత క్యాష్‌ చేయాలనీ, తన కెరీర్‌కి మరింత ఉపయోగపడేలా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, తన విదేశీ టూర్‌ని మధ్యలోనే కేన్సిల్‌ చేసుకుని రామ్‌ ఇండియాకి తిరిగొచ్చేస్తున్నాడట.

 

వచ్చాక, మళ్లీ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేయనున్నాడట. భారీ ఎత్తున రామ్‌ ప్రమోషన్స్‌లో పాల్గొననున్నాడట. ఇప్పటికే పూరీ జగన్నాధ్‌ విచ్చలవిడిగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఇస్మార్ట్‌ గాళ్స్‌ నిధి, నభా నటేష్‌లు కూడా ప్రమోషన్స్‌లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక రామ్‌ కూడా రంగంలోకి దిగితే, 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి ఇప్పట్లో ఢోకా లేదనే చెప్పాలేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS