మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో 'క్వీన్' సినిమా చేస్తోంది. తమిళంలో 'కన్నెకాలైమన్నె' సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన పోస్టరే ఇది. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ అయ్యింది. గ్లామరస్ లుక్స్‌తో తమన్నాని చూసి, ఇలా చూడాలంటే, కొంచెం కష్టంగానే ఉంది. కానీ తమన్నాకి ఏదైనా సెట్ అయిపోతుంది కదా. అందుకే ఈ లుక్ డిఫరెంట్‌గా అనిపిస్తోంది. గతంలో డీ గ్లామర్ లుక్‌తో నటించిన సినిమాలు కూడా విజయం సాధించాయి.
'అభినేత్రి' సినిమాలో పల్లెటూరి యువతిలా డీ గ్లామర్ లుక్‌లో కనిపించింది. తాజాగా 'కన్నెకాలమన్నె' సినిమా కోసం ఇదిగో ఇలా డీ గ్లామర్ గెటప్‌లోకి మారిపోయింది. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నటిగా ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రను ఈ సినిమాలో తమన్నా పోషిస్తోంది. ఖచ్చితంగా అందరూ మెచ్చుకునేలా ఉంటుందనీ తమన్నా నమ్మకం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ఇలాంటి పాత్రలు ఎప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉంటాయ్.
నిజాననికి గ్లామరస్ పాత్రల కంటే, ఈ తరహా పాత్రలే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెస్తాయి కూడా. అందుకే ఇంతవరకూ పలు గ్లామరస్ క్యారెక్టర్స్‌లో నటించిన తమన్నా, ఇకపై ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలకే సై అంటోంది. బాలీవుడ్ 'క్వీన్'కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'క్వీన్' కూడా తమన్నాకి ఛాలెంజింగ్ పాత్రే. బాలీవుడ్‌లో ఈ సినిమాతోనే కంగనా క్వీన్ అయిపోయింది. అలాగే ఆల్రెడీ స్టార్ హీరోయిన్ అయిన తమన్నాకి ఈ సినిమా మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందనీ చిత్ర యూనిట్ భావిస్తోంది.