పద్మావతి చిత్రం పైన రోజు ఏదొక వివాదం నమోదవుతునే ఉంది. ఇక దీని పర్యవసానమే, రేపు విడుదల కావాల్సిన ఈ చిత్రం నిరవధికంగా వాయిదాపడింది.
తాజాగా ఈ వివాదం పై కన్నడ హీరో రాజకీయ నాయకుడు అయిన ఉపేంద్ర స్పందించాడు. ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా సదరు సెన్సార్ బోర్డు నియమావళిని అనుసరించి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని కోరాడు. తాను కూడా గతంలో ఇటువంటి ఇబ్బందులు ఎడురుకున్నాను అని గుర్తుచేశాడు.
సమాజంలో నచ్చకపోతే నిరసన తెలిపే హక్కు అందరికి ఉంటుంది అని అయితే అది ఇంకొకరికి హాని చేసేలా ఉండకూడదు అని తెలిపాడు.
ప్రస్తుతం ఉపేంద్ర త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తాను కొత్తగా పెట్టిన పార్టీతో పోటీలోకి దిగడానికి సన్నధం అవుతున్నాడు.