కోదండరామిరెడ్డి అంటే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. ఆయన కొడుకు వైభవ్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'గొడవ' తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ తెలుగులో హీరోగా సక్సెస్ దక్కలేదు వైభవ్‌కి. ప్రస్తుతం తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే మరో డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి కూడా హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రస్తుతం తెలుగులో స్టైలిష్ విలన్‌గా సత్తా చాటుతున్నాడు. 'సరైనోడు'తో ఆది విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా 'అజ్ఞాతవాసి'లోనూ యంగ్ విలన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూనే, తెలుగులో విలన్‌గా మంచి ఛాన్సులు కొట్టేస్తున్నాడు ఆది.
అలాగే వైభవ్ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నాడు. హీరోగానే కాదు, విలన్‌గానూ, విభిన్న తరహా క్యారెక్టర్స్‌లోనూ టాలెంట్ చూపించగల సత్తా వైభవ్‌లో కూడా ఉంది. తమిళంలో బిజీగానే ఉన్నా, కానీ తెలుగులో వరుస సినిమాలతో బిజీ కావాలన్నదే వైభవ్ ఆలోచన. ఇది సరే.. వైభవ్ మనసులో మరో కోరిక కూడా ఉందట. అదేంటంటే దర్శకత్వం చేయాలని. దర్శకుడి కొడుకు కదా. మొదట్నుంచీ వైభవ్‌కి డైరెక్షన్ ఫీల్డ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అట. అయితే ఇంతవరకూ అది కుదరలేదు. ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడట వైభవ్.
అంతేకాదు పవన్‌కళ్యాణ్‌తో తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని వైభవ్ అనుకుంటున్నాడట. చిరంజీవితో కోదండరామిరెడ్డి గతంలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అలా కాకపోయినా, ఎప్పటికైనా పవన్‌తో ఒక్క సినిమా అయినా చేయాలన్నదే వైభవ్ కోరికట. ఏమో, మన యంగ్ హీరో కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి మరి.