అజ్ఞాతవాసి టీంకి ఫ్రెంచ్ దర్శకుడి హెచ్చరిక!

మరిన్ని వార్తలు

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా విడుదలకి ముందునుండే ఇది ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కి ఫ్రీమేక్ అంటూ వార్తలు రావడం అది తెలిసి T సిరీస్ వారు సదరు ప్రొడక్షన్ వారి దగ్గర నుండి భారీ మొత్తంలో ఫైన్ ద్వారా వసూలు చేసినట్టు సమాచారం.

ఇక ఇవ్వని పక్కనపెడితే లార్గో వించ్ తీసిన దర్శకుడు జేరోమీ కూడా ఈ అంశం పైన స్పందించడం అలాగే అజ్ఞాతవాసి చిత్రాన్ని మొదటిరోజే చూస్తాను అని ట్వీట్ చేశాడు. చెప్పిన విధంగానే చూసి తన సినిమా కథకి ఈ సినిమా కథకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి అంటూ తెలిపాడు. దానితో ఆగకుండా, ఈ సినిమా వారు కాపీరైట్స్ నిమిత్తం T సిరీస్ వారికి మాత్రమే ఫైన్ చెల్లిస్తే సరిపోదు అని ఎందుకంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయినందున వేరే సంస్థలకి అలాగే తనకి కూడా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది అని ఆయన పరోక్షంగా ట్వీట్ చేశాడు.

దీనితో అసలే సినిమాకి బ్యాడ్ టాక్ రావడంతో సినిమా అనుకున్న రేంజ్ లో వసూళ్ళు సాధించకపోవచ్చు అన్న సమయంలో ఈ అంశం అజ్ఞాతవాసి టీంకి కొత్త తలనొప్పిగా మారనుంది.

ఈ అంశం పైన అజ్ఞాతవాసి యూనిట్ ఎలా స్పందిస్తారో అన్నది వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS