షూటింగ్‌లో గాయపడిన విశాల్‌.!

మరిన్ని వార్తలు

తమిళ హీరో విశాల్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్‌ టర్కీలో జరుగుతోంది. సుందర్‌ సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి టర్కీలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ నేపథ్యంలో జరిగిన బైక్‌ యాక్సిడెంట్‌లో ఆయన గాయపడ్డారు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ కాలికి, చేతికి గాయాలు కావడంతో కొద్ది రోజులు రెస్ట్‌ అవసరమని వైద్యులు సూచించారట. 

 

చేతికి, కాలికి గాయం కావడంతో వీల్‌ ఛైర్‌లో కూర్చొని వున్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు విశాల్‌. మంచి పనే చేశాడు విశాల్‌. లేదంటే, ఈ న్యూస్‌ ఆ నోటా ఈ నోటా పాకి ఇంకేముంది విశాల్‌ పరిస్థితి విషమం అనే న్యూస్‌ వైరల్‌ అయిపోయేది. గాయాలతో ఉన్న ఆయన ఫోటో చూసి ఓకే విశాల్‌ ఆరోగ్యం బాగానే ఉందని మరింత త్వరగా ఆయన కోలుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

 

సో ఫేక్‌ న్యూస్‌కి ఆస్కారం లేదు. లేదంటే ఈ మధ్య ఈ యాక్సిడెంట్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వక్ర మార్గంలో వైరల్‌ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విశాల్‌ హైద్రాబాదీ అమ్మాయి ఆశ్రితతో ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా గాయాల నుండి విశాల్‌ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS